సినిమా

Nivetha Thomas: 'జై బాలయ్య' పాటకు స్టెప్పేసిన నివేదా.. కామెంట్ పెట్టిన జుకల్కర్..

Nivetha Thomas: జై బాలయ్య అనేది ఓ పేరు కాదు అది ఒక ఎమోషన్. ఆయన పేరు మాత్రమే కాదు.. సినిమాలు కూడా ఒక ఎమోషనే.

Nivetha Thomas: జై బాలయ్య పాటకు స్టెప్పేసిన నివేదా.. కామెంట్ పెట్టిన జుకల్కర్..
X

Nivetha Thomas: జై బాలయ్య అనేది ఓ పేరు కాదు అది ఒక ఎమోషన్. ఆయన పేరు మాత్రమే కాదు.. సినిమాలు కూడా ఒక ఎమోషనే. అందులోని పాటలు అయితే ప్రతీ ఒక్కరిని అలరించేలాగా ఉంది. అందుకే సెలబ్రిటీలు సైతం ఆయన పాటలకు స్టెప్పులేయడానికి ఇష్టపడతారు. అలాగే మలయాళ భామ నివేదా థామస్ కూడా జై బాలయ్య పాటకు స్టెప్పులేసింది. దానికి సెలబ్రిటీలు సైతం బాగుందంటూ కామెంట్ చేశారు.

'అఖండ' సినిమాతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నారు. ఈ సినిమాలో ప్రతీ అంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలయితే సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. అఖండకు తమన్ ఇచ్చిన సంగీతం పెద్ద ప్లస్‌గా నిలిచింది. ముఖ్యంగా జై బాలయ్య పాటను ఇప్పటికీ చాలామంది ఆదరిస్తున్నారు. ఇటీవల ఆ పాటలో బాలకృష్ణ ఐకానిక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను చేసింది నివేదా థామస్.

జై బాలయ్య పాటలో బాలకృష్ణ వేసిన స్టెప్ థియేటర్లలో ఫ్యాన్స్‌తో విజిల్ వేయించింది. అదే స్టెప్పును అలాగే చేసే ప్రయత్నం చేసింది నివేదా థామస్. కానీ అది కాస్త మిస్ ‌ఫైర్ అయ్యింది. చివర్లో ఆ స్టెప్ తాను ఎలా చేసిందో చూపించింది నివేదా. అలా వీడియో చివర్లో నెటిజన్లను నవ్వించే ప్రయత్నం చేసింది. అయితే నివేదా పోస్ట్ చేసిన ఈ వీడియోకు ప్రీతమ్ జకల్కర్ నవ్వుతున్న ఇమోజీలను కామెంట్ పెట్టాడు.


Next Story

RELATED STORIES