డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్!‌

డైరెక్టర్‌ శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్!‌
2010లో వచ్చిన 'రోబో' సినిమా కథ వివాదంపై దర్శకుడు శంకర్ కు చెన్నై ఎగ్మూర్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

2010లో వచ్చిన 'రోబో' సినిమా కథ వివాదంపై దర్శకుడు శంకర్ కు చెన్నై ఎగ్మూర్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తన కథ 'జిగుబా'ను శంకర్ చోరీ చేసి ఈ సినిమా తీశారంటూ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కోసం పదేళ్లుగా శంకర్ కోర్టుకు హాజరుకాలేదు. దీనితో కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన 'జిగుబా' కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఆ తర్వాత 2007లో 'ధిక్‌ ధిక్‌ దీపిక ధీపిక' అనే నవలగా ప్రచురితమైంది. అయితే ఈ కథను కాపీ కొట్టి శంకర్‌.. రజనీకాంత్‌-ఐశ్వర్యరాయ్‌ లను పెట్టి 'రోబో' తెరకెక్కించాడని ఆరోపణలు చేశారు. దీనితో సినిమా విడుదలైన వెంటనే కాపీ రైట్‌ యాక్ట్‌ కింద అరుర్‌ కోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story