సినిమా

NTR Shocking : టీవీ5 ప్రశ్నకి ఎన్టీఆర్ షాక్..!

ఒక్క ప్రశ్న అలజడి పుట్టించింది.. ఒక్క ప్రశ్న టోటల్‌ యూనిట్‌ను సైలెన్స్‌ చేసింది.. అప్పటి వరకు హుషారుగా, జాలీగా సాగుతున్న త్రిపుల్‌ ఆర్‌ ప్రెస్‌మీట్‌.

NTR Shocking : టీవీ5 ప్రశ్నకి ఎన్టీఆర్ షాక్..!
X

ఒక్క ప్రశ్న అలజడి పుట్టించింది.. ఒక్క ప్రశ్న టోటల్‌ యూనిట్‌ను సైలెన్స్‌ చేసింది.. అప్పటి వరకు హుషారుగా, జాలీగా సాగుతున్న త్రిపుల్‌ ఆర్‌ ప్రెస్‌మీట్‌.. టీవీ-5 ప్రతినిధి రాంబాబు అడిగిన ప్రశ్నతో ఒక్కసారిగా వేడెక్కింది. అటు డైరెక్టర్‌ రాజమౌళి.. ఇటు నిర్మాత దానయ్య.. మధ్యలో ఎన్టీఆర్‌.. కొంచెం సేపు తడుముకున్నారు. ఏం చెప్పాలో తెలియక సైలెన్స్‌ వహించారు.

ముందు డైరెక్టర్‌ రాజమౌళికి టీవీ-5 ప్రతినిధి రాంబాబాబు.. ప్రిమియర్‌ షో వేస్తున్నట్లు తెలిసింది నిజమేనా.? అని ప్రశ్న సంధించగా.. సమాధానికి రాజమౌళి తడబడ్డారు. అవునా.. నిజమేనా.. అంటూ.. ఫోకస్‌ను నిర్మాత వైపు షిఫ్ట్‌ చేశారు. వెంటనే నిర్మాతకు టీవీ-5 ప్రతినిధి రాంబాబు అడిగిన పవర్‌ఫుల్‌ ప్రశ్నతో మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఏపీలో టికెట్ల ధరల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కదా.. ఎన్టీఆర్‌ ఫ్రెండ్స్‌ వల్లభనేని వంశీ, కొడాలి నాని హెల్ఫ్‌ ఏమైనా తీసుకుంటారా.? అన్న ప్రశ్నకు మొత్తం టీమ్‌ సైలెంట్‌ అయిపోయింది.

దానయ్య ఏం సమాధానం చెబుతారో అన్న టెన్షన్‌ ఎన్టీఆర్‌లో కనిపించింది. ఏం చెబితే ఏం ఇబ్బందో అన్న టెన్షన్‌ దానయ్యలో కనిపించింది. ఇప్పుడు టీవీ-5 అడిగిన ఈ ప్రశ్నలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. త్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ షాకింగ్స్‌.. ఫుల్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి.


Next Story

RELATED STORIES