సినిమా

NTR : బుచ్చిబాబుకి గ్రీన్‌‌సిగ్నల్... ఒకేసారి రెండు సినిమాలతో ఎన్టీఆర్..!

NTR : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీ రిజల్ట్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్ శివ కొరటాలతో కొత్త సినిమాని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.

NTR : బుచ్చిబాబుకి గ్రీన్‌‌సిగ్నల్... ఒకేసారి రెండు సినిమాలతో ఎన్టీఆర్..!
X

NTR : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీ రిజల్ట్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్ శివ కొరటాలతో కొత్త సినిమాని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కానీ కరోనా కారణంగా RRR నిరవధికంగా వాయిదా పడింది. దీనితో ఎన్టీఆర్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానాతో ఓ సినిమాని చేయాలనీ ఎన్టీఆర్ అనుకున్నాడు.

ఇప్పటికే కథ విన్న ఎన్టీఆర్.. దీనికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. కొరటాల, బుచ్చిబాబు సినిమాలను ఏకకాలంలో కంప్లీట్ చేయాలనీ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నారట.. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌తో సినిమాని పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట.

కొరటాల శివ – ఎన్టీఆర్‌‌ల సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒకటి రెండు నెలల తర్వాత బుచ్చిబాబు సినిమాని ప్రారంభించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ సినిమాలని కంప్లీట్ చేయాలనీ ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ చివరిసారిగా అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించాడు.

Next Story

RELATED STORIES