సినిమా

Puneeth Rajkumar: ఎన్‌టీఆర్, పునీత్ మధ్య ఫ్రెండ్‌షిప్ ప్రత్యేకం.. ఆయన కోసమే ఆ ఆఫర్‌కు ఓకే..

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు తెలుగు హీరోలతో కూడా మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు తెలుగు హీరోలతో కూడా మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. ఆయనకు తెలుగులో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు తెలుగు హీరోలను కలుస్తూ తమ సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అందుకే వారు కూడా పునీత్ సినిమాలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ముఖ్యంగా పునీత్ రాజ్‌కుమార్‌కు, ఎన్‌టీఆర్‌కు మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్‌టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆంధ్రవాలా' విపరీతమైన క్రేజ్ మధ్యలో విడుదలయింది. కానీ ఆశించినంత ఫలితాలను మాత్రం అందించలేకపోయింది. అయినా దీనిని కన్నడలో 'వీర కన్నడిగా' టైటిల్‌తో రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ఇది డీసెంట్ హిట్‌ను సాధించింది. అప్పటినుండి పునీత్, ఎన్‌టీఆర్ మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలయ్యింది.

ఎమ్ శరవణన్ దర్వకత్వంలో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రమే 'చక్రవ్యూహ'. ఇందులో ఒక పాట పాడడం కోసం ఎన్‌టీఆర్‌కు పర్సనల్‌గా ఆఫర్ ఇచ్చారు పునీత్. వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకుని ఎన్‌టీఆర్ కూడా ఈ ఆఫర్‌కు ఒప్పుకున్నారు. 'గెలెయా గెలెయా' అంటూ సాగే ఈ పాట అప్పట్లో చాలా వైరల్‌గా మారింది.

పునీత్ మరణవార్త విన్న ఎన్‌టీఆర్ 'నమ్మలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది' అని ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES