సినిమా

NTR Watch Price: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో ఎన్‌టీఆర్ ధరించిన వాచ్ ధర ఎన్ని కోట్లంటే..

NTR Watch Price: ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి.

NTR Watch Price (tv5news.in)
X

NTR Watch Price (tv5news.in)

NTR Watch Price: ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్‌ను బాహుబలి రేంజ్‌లో హిట్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అందుకే సినిమా విడుదలకు ఇంకా నెలరోజుల సమయం ఉన్నా.. ఇప్పటినుండే ప్రెస్ మీట్స్‌తో అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కు ఎన్‌టీఆర్ ధరించిన వాచ్ హైలెట్ అవుతోంది. ఇక దాని ధర తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటినీ చుట్టేస్తోంది. ప్రతీ భాషలో ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తోంది. మీడియాతో ముచ్చటిస్తూ, వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తోంది. అయితే ఏదైనా సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు తమ ఫేవరెట్ హీరోలు ధరించే బట్టల గురించి, వాచ్‌ల గురించి గూగుల్ చేసే అభిమానులు ఎన్‌టీఆర్ వాచ్ ధరను గూగుల్ చేశారు.

ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ధరించిన రిచర్డ్ మిల్లీ ఆర్‌ఎమ్ 11 వాచ్ ధర ఏకంగా రూ. 39,932,935. ఈ ధర చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టేసుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు.Next Story

RELATED STORIES