సినిమా

Samantha: సోషల్ మీడియాను ఊపేస్తున్న 'ఊ అంటావా.. ఊఊ అంటావా' సాంగ్ మేకింగ్ వీడియా..

Samantha: సమంత అప్పటివరకు ఒక స్పెషల్ సాంగ్ చేయగలదని, అందులో అంత హాట్‌గా కనిపించగలదని ఎవరూ ఊహించలేదు.

Samantha: సోషల్ మీడియాను ఊపేస్తున్న ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ మేకింగ్ వీడియా..
X

Samantha: సమంత అప్పటివరకు ఒక స్పెషల్ సాంగ్ చేయగలదని, అందులో అంత హాట్‌గా కనిపించగలదని ఎవరూ ఊహించలేదు. పుష్పలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట చూసేవరకు. అప్పటివరకు సాఫ్ట్ రోల్స్‌లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ సాంగ్ కోసం సమంత ఎంత కష్టపడిందో ఒక్క వీడియోలో చూపించేశారు.

సమంత.. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించింది కూడా చాలా తక్కువ. అలాగే ఎక్కువగా డ్యాన్స్ చేసిన పాటలు కూడా తక్కువే. గత కొన్నిరోజులుగా సమంత ఎక్కువగా క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను మాత్రమే చేస్తూ ముందుకెళ్తోంది. అంతే కాకుండా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమాల వైపు కూడా అడుగులేస్తోంది.

పుష్ప లాంటి మాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండడం సహజమే అనుకున్నారంతా. కానీ ఆ సాంగ్‌ను సుకుమార్.. సమంతతో చేయిస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. సమంత ఈ పాటలో కనిపించడంతో పాటు తన హాట్‌నెస్‌తో, డ్యాన్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. అందుకే ఈ పాట విడుదలయిన కొన్నిరోజుల్లోనే రికార్డులను క్రియేట్ చేయడం మొదలుపెట్టింది.

సినిమాలో సమంత పాట చాలా ప్రత్యేకమని మూవీ టీమ్ కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పింది. అందుకే వీడియో సాంగ్ మాత్రమే కాదు.. ఈ సాంగ్ మేకింగ్ వీడియో కూడా విడుదలయిన కాసేపట్లోనే విపరీతంగా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. ఇందులో డ్యాన్స్ కోసం సమంత ఎంత కష్టపడిందో స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES