సినిమా

RRR Release Date: 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదాపై టీమ్ అధికారిక ప్రకటన..

RRR Release Date: జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' సినిమాను థియేటర్లలో చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదరుచూస్తున్నారు.

RRR Release Date (tv5news.in)
X

RRR Release Date (tv5news.in)

RRR Release Date: జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' సినిమాను థియేటర్లలో చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ప్రమోషన్స్ కార్యక్రమాల వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. కానీ ఒమిక్రాన్ వల్ల విడుదల వాయిదా అన్న వార్తలు వారిని కలవరపెట్టాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజమేనంటూ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

'మనం ఎంత శ్రమించినా.. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. చాలావరకు దేశంలోని థియేటర్లు అన్ని మూతబడుతుండడంతో మిమ్మల్ని ఎక్సైట్‌మెంట్‌తో ఆగమని చెప్పడం తప్ప మాకు వేరే దారి లేకుండా పోయింది. ఇండియన్ సినిమా అంటే ఏంటో త్వరలోనే, సరైన సమయంలో చూపిస్తాం' అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.


Next Story

RELATED STORIES