సినిమా

Oke Oka Jeevitham: శర్వానంద్‌కు అమ్మగా అమల.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 'ఒకేఒక్క జీవితం'..

Oke Oka Jeevitham: యూత్‌కు దగ్గరయ్యే కథలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు శర్వానంద్.

Oke Oka Jeevitham (tv5news.in)
X

Oke Oka Jeevitham (tv5news.in)

Oke Oka Jeevitham: యూత్‌కు దగ్గరయ్యే కథలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు శర్వానంద్. టాలీవుడ్‌లో హీరోగా శర్వాకు సక్సెస్ తీసుకొచ్చినవి కమర్షియల్ సినిమాలే అయినా.. తన కెరీర్‌లో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నడిచే సినిమాలే ఎక్కువ. అలాంటి మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'ఒకే ఒక్క జీవితం' చిత్రంతో మన ముందుకు రానున్నాడు శర్వానంద్. ఇందులో తన తల్లి పాత్రలో అక్కినేని అమల నటించడం విశేషం.

ఒకప్పుడు చాలామంది స్టా్ర్ హీరోలతో నటించి, టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చకుంది అమల. కానీ అక్కినేని నాగార్జునతో పెళ్లి అయిన తర్వాత మాత్రం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండడం మొదలుపెట్టింది. మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి ఒకే ఒక్క జీవితం చిత్రంలో హీరో శర్వానంద్‌కు తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది అమల.

శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. తెలుగులో ఇది 'ఒకే ఒక్క జీవితం' పేరుతో విడుదల కాగా తమిళంలో 'కనమ్'గా ప్రేక్షకులను పలకరించనుంది. యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్‌ను అందిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ కనిపించనున్నారు. మొదటిసారి హీరో శర్వానంద్‌తో జతకడుతోంది తెలుగమ్మాయి రీతూ వర్మ.

తాజాగా విడుదలయిన 'ఒకే ఒక్క జీవితం' టీజర్ చూస్తుంటే.. ఇదొక టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమని అర్థమవుతోంది. టైమ్ ట్రావెల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే తెలుగు సినిమా 'ఆదిత్య 369'. అయితే ఒకే ఒక్క జీవితం కూడా అలాగే ఎంటర్‌టైనింగ్‌గా సాగనుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. 2022లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story

RELATED STORIES