Poornima : గొల్లపూడి మారుతీరావు నన్ను నిజంగానే కొట్టారు : పూర్ణిమ

Poornima : గొల్లపూడి మారుతీరావు నన్ను నిజంగానే కొట్టారు : పూర్ణిమ
Poornima : సినిమా ఆర్టిస్ట్‌ అని ఏ సంబంధమూ రాలేదని, కుమారిగానే మిగిలిపోతానేమో అని అనుకున్నానని అలనాటి హీరోయిన్ పూర్ణిమ చెప్పారు.

Poornima : సినిమా ఆర్టిస్ట్‌ అని ఏ సంబంధమూ రాలేదని, కుమారిగానే మిగిలిపోతానేమో అని అనుకున్నానని అలనాటి హీరోయిన్ పూర్ణిమ చెప్పారు.. అలీతో సరదాగా షోకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ముందుగా సప్తపది సినిమాలో హీరోయిన్‌‌గా ఛాన్స్ వచ్చిందని కానీ డాన్స్ రాకపోవడంతో ఆ సినిమా ఛాన్స్ మిస్ అయిందని చెప్పుకొచ్చింది.

ఇక తాను కెరీర్‌‌లో ముందుగా సింగర్ అవుదామని అనుకున్నానని తెలిపింది పూర్ణమ... హీరోయిన్‌గా తన పక్కన చేయమని నటుడు ఏయన్నార్‌ అడిగేవారని చెప్పింది. తన కెరీర్‌‌లో బెస్ట్ ఫిలిమ్ అంటే శ్రీవారికి ప్రేమలేఖ అని తెలిపారు ఆమె.. ఇక మనిషికొక చరిత్ర షూటింగ్‌ సందర్భంలో నటుడు గొల్లపూడి మారుతీరావు నిజంగానే తనని కొట్టారని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

అప్పుడే అక్కడే ఉన్న తన తండ్రి మారుతీరావుని ఎందుకు కొట్టారని అడిగితే ... నాకు కూతుళ్ళు లేరని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలిపింది పూర్ణిమ. కాగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంతో హీరోయిన్‌‌గా చిత్రపరిశ్రమకి పరిచయమైంది పూర్ణిమ..1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారుగా 100 సినిమాల్లో నటించింది. ఇక రతన్ వుపులూరిని వివాహం చేసుకున్నారు పూర్ణిమ. ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు.

Tags

Read MoreRead Less
Next Story