సినిమా

Katrina-Vicky : కత్రినా కౌశల్‌ పెళ్లి వీడియోకి ఓటీటీ సంస్థ క్రేజీ ఆఫర్..

Katrina-Vicky : ఓ భారీ బడ్జెట్ చిత్రం ఓటీటీలో ప్రసారం చేయాలన్నా కూడా ఆ చిత్ర నిర్మాతకి అంత ముట్టజెప్పదేమో..

Katrina-Vicky : కత్రినా కౌశల్‌ పెళ్లి వీడియోకి ఓటీటీ సంస్థ క్రేజీ ఆఫర్..
X

Katrina-Vicky : ఓ భారీ బడ్జెట్ చిత్రం ఓటీటీలో ప్రసారం చేయాలన్నా కూడా ఆ చిత్ర నిర్మాతకి అంత ముట్టజెప్పదేమో.. కానీ ఓ బాలీవుడ్ జంట వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రసార హక్కుల కోసం ఓటీటీ సంస్ధ వీరిద్దరితో బేరసారాలు సాగిస్తోంది. భారీ ఆఫర్‌ను ఎరజూపింది.

ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 9న వివాహం చేసుకోబోతున్నారు. సెలబ్రెటీల వివాహం అంటే సామాజిక మాధ్యమాలకు పండగే. ప్రతి చిన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఫోటోలకు, వీడియోలకు కోట్లలో వ్యాపారం జరగడం మామూలే.. ఇది కూడా ఓ వ్యాపారంగా మారిపోయింది.

తాజాగా కత్రినా, కౌశల్ వివాహానికి సంబంధించి వీడియో ప్రసార హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే కత్రినా, విక్కీ‌ ఈ విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఒక ఓటీటీ సంస్థ వివాహవేడుకలకు సంబంధించిన ప్రసార హక్కుల కోసం ఇంత భారీ మొత్తం చెల్లిస్తాననడం ఇదివరకెన్నడూ జరగలేదు. ఇదే తొలిసారి. ఒకవేళ ఈ జంట ఈ ఒప్పందానికి ఓకే చెబితే.. వారి వివాహాన్ని ఓటీటీ ప్రత్యక్షప్రసారం చేసే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES