Partner: మ్యాజికల్ మెలోడిలో 'మురిసిపోతున్న' ఆది పినిశెట్టి

Partner: మ్యాజికల్ మెలోడిలో మురిసిపోతున్న ఆది పినిశెట్టి
ఆది పినిశెట్టి ‘పార్ట్‌నర్’ మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ హన్సిక మోత్వాని జంటగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘పార్ట్‌నర్’. డైరెక్టర్ మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ & కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఎంఎస్ మురళీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. బి.జి.గోవింద్ రాజు సమర్పణలో ఈ మూవీ రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాలోని మురిసిపోతున్న ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో, హీరోయిన్లు అందంగా, స్టైల్ గా కనిపిస్తున్నారు. తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ, హీరోయిన్ వెంట తిరిగే ఆది.. ఈ పాటలో చాలా యంగ్ గా, క్యూట్ గా కనిపించాడు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

‘హిలేరియస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘పార్ట్‌నర్’ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరిస్తుంది. మేము నవ్వించడానికి రెడీ.. మీరు నవ్వడానికి రెడీనా ?” అని ఇప్పటికే ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మేకర్స్ ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పల్లక్ లాల్వానీ, పాండిరాజన్, రోబో శంకర్ సైతం ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ ధయానిధి సంగీతం అందిస్తుండగా, షబీర్ అహమ్మద్ సినిమాటోగ్రఫర్. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఆది పినిశెట్టి మరో సినిమాలోనూ కనిపించనున్నారు. మిరుగం అనే టైటిల్ తో వచ్చిన తమిళంకు రీమేక్ గా తెలుగులో మృగం పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ జై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 18న మరోసారి తెలుగులో విడుదల చేయనున్నారు. ఓ గ్రామంలో జులాయిగా తిరిగే ఓ మొరటు యువకుడి కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మగరాయుడిలా పెరిగిన అమ్మాయి పాత్రలో పద్మప్రియ నటించింది. భిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రయాణం ఎలా సాగిందన్న దానిపై ఈ మూవీ సాగనుంది.


Tags

Read MoreRead Less
Next Story