సినిమా

Bheemla Nayak: ఫ్యాన్స్‎కు పవన్‌కల్యాణ్‌ బిగ్ సర్‌ప్రైజ్‌..!

Pawan Kalyan: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అప్‎డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

Bheemla Nayak: ఫ్యాన్స్‎కు పవన్‌కల్యాణ్‌ బిగ్ సర్‌ప్రైజ్‌..!
X

Pawan Kalyan: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అప్‎డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక పవన్ బర్త్ డే వచ్చిందంటే చాలు వారం రోజులు ముందుగానే సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఇటీవలే పవన్-రానా కలిసి నటిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్‌'. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇటీవలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ గింప్స్‌, టీజర్‌తో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత పక్కా మాస్‌ లుక్‌లో కనిపించిన ఆయన్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి భీమ్లానాయక్‌ బృందం సిద్ధంగా ఉంది.

'భీమ్లా నాయక్‌' ఫస్ట్‌ గ్లింప్స్‌కు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.16 నిమిషాలకు చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సాగర్‌ కె చంద్ర ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ''మండుతున్న రైఫిల్స్‌ ప్రతిధ్వనించడానికి సిద్ధమవుతున్నాయి. పవర్‌ అంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్‌ చేసుకుందాం'' ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.Next Story

RELATED STORIES