సినిమా

Chiru 154: మెగాస్టార్ సినిమాలో పవర్‌స్టార్.. అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ వచ్చేస్తోంది..

Chiru 154: వెండితెరపై ఒక హీరో కనిపిస్తూ.. తన నటనతో, డ్యాన్సులతో అలరిస్తుంటేనే ప్రేక్షకులు అబ్బురపోయి చూస్తూ ఉంటారు.

Chiru 154 (tv5news.in)
X

Chiru 154 (tv5news.in)

Chiru 154: వెండితెరపై ఒక హీరో కనిపిస్తూ.. తన నటనతో, డ్యాన్సులతో అలరిస్తుంటేనే ప్రేక్షకులు అబ్బురపోయి చూస్తూ ఉంటారు. అదే ఒక తెరపై ఇద్దరు హీరోలు కనిపిస్తే.. ఇక మూవీ లవర్స్‌కు డబుల్ ధమాకా లాంటిదే. ఒకవేళ ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీ నుండి అయితే.. అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే అలాంటి ఒక వార్తే తాజాగా ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అందరు హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందులోనూ పవన్ కళ్యాణ్‌కు మరీ ఎక్కువ. పవన్ సినిమాలు ఫ్లాప్ అయినా.. ఆయన సినిమాలు వదిలేసి వెళ్లినా.. ఆయన అభిమానులు మాత్రం ఆయనను ఆరాధిస్తూనే ఉన్నారు. అందుకే పవన్ మళ్లీ సినిమాల్లోకి తిరిగొచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఎలాంటి సినిమాలు తీస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారో అలాంటివే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ముందుగా 'వకీల్ సాబ్‌'తో సెకండ్ ఇన్నింగ్స్‌ను బ్లాక్‌బస్టర్‌గా స్టార్ట్ చేశారు. ఈ చిత్ర కథ ఒక సోషల్ మెసేజ్ డ్రామా అయినా.. ఇందులో పవన్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ స్టఫ్ కూడా జతచేర్చాడు దర్శకుడు.

ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా 'భీమ్లా నాయక్' నుండి వస్తున్న వరుస అప్డేట్స్ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాయి. భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయిన తర్వాత మిగతా సినిమాల షూటింగ్లలో పాల్గొననున్నాడు పవన్. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు.. మొత్తం మెగా అభిమానులనే సంతోషపెడుతున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి 154 చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ప్రీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మరొక హీరోకు కూడా స్కోప్ ఉండేలా కథ రాసుకున్నాడట బాబీ. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు టాక్.

మెగాస్టార్, పవన్ స్టార్‌ను ఒకే స్క్రీన్‌పై చూడాలని ఎంతోమంది మెగా అభిమానుల కోరిక. వీరిద్దరి సినీ కెరీర్‌లో వీరు కలిసి నటించిన ఒకేఒక్క సినిమా 'శంకర్ దాదా జిందాబాద్'. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా.. పవన్ కళ్యాణ్ క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్‌లో అలరించారు. కానీ బాబీ సినిమాలో అలా కాకుండా ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ వార్తలపై మూవీ టీమ్ ఏమీ స్పందించకపోయినా.. ఇవి నిజమయితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరో పక్క ఈ పాత్ర కోసం బాబీ.. రవితేజను కూడా సంప్రదిస్తున్నట్టు

Next Story

RELATED STORIES