సినిమా

Bhavadeeyudu Bhagat Singh: 'భవదీయుడు భగత్‌సింగ్‌' కోసం పవన్ సిద్ధం.. సినిమాపై క్రేజీ అప్డేట్..

Bhavadeeyudu Bhagat Singh: పవన్ అప్‌కమింగ్ చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Bhavadeeyudu Bhagat Singh: భవదీయుడు భగత్‌సింగ్‌ కోసం పవన్ సిద్ధం.. సినిమాపై క్రేజీ అప్డేట్..
X

Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాతి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత 'వకీల్ సాబ్‌'తో మర్చిపోలేని హిట్‌ను అందుకున్నాడు పవన్. ఆ తర్వాత ఒకేసారి మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. తాజాగా పవన్ అప్‌కమింగ్ చిత్రం 'భవదీయుడు భగత్‌సింగ్‌' గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కింది ఒకే సినిమా. అది కూడా ఓ రీమేక్. అయినా.. అప్పటివరకు వరుసగా ఫ్లాప్స్‌లో ఉన్న పవన్ కళ్యాణ్. ఆయన హిట్ కోసం ఎదురుచూస్తున్న వపన్ ఫ్యాన్స్ ఈ సినిమా ఇచ్చిన హై అంతా ఇంతా కాదు. అందుకే హరీష్ శంకర్ అంటే పవన్ ఫ్యాన్స్‌కు ఇష్టం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్‌సింగ్' ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్.

గబ్బర్‌సింగ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సమయంలో హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తే బాగుండు అని చాలామంది ఆశపడ్డారు. మరికొందరు హరీష్ శంకర్‌కు, వపన్ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే వీరిద్దరు కలిసి పనిచేయట్లేదు అన్న రూమర్స్‌ను కూడా సృష్టించారు. ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ పవన్‌తో కలిసి భవదీయుడు భగత్‌సింగ్‌ అనే చిత్రాన్ని ప్రారంభించాడు హరీష్.

తాజాగా భవదీయుడు భగత్‌సింగ్‌‌కు ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఈ సినిమాలో ఇప్పటికే తాను రెండు పాటలను కంపోజ్ చేసేశానని అన్నాడు దేవీ. ఇందులో పాటలు ఎనర్జిటిక్‌గా, మెలోడియస్‌గా ఉంటాయన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభవుతుందని గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే భవదీయుడు భగత్‌సింగ్‌ పాటలు గబ్బర్‌సింగ్‌ను మించిపోయేలా ఉంటాయని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు పవన్ అభిమానులు.

Next Story

RELATED STORIES