సినిమా

Singer Harini : సింగర్‌ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి..!

Singer Harini : ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌కు సీఈవో ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది..

Singer Harini : సింగర్‌ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి..!
X

Singer Harini : ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌కు సీఈవో ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. బెంగళూరు రైల్వే ట్రాక్‌పై ఏకే రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. ఫోన్లు పనిచేయకపోడంతో ఏకే రావు కుటుంబం మొత్తం మిస్‌ అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఏకేరావు కుటుంబం.. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్లింది.. అప్పట్నుంచి ఏకేరావు ఆచూకీ కనిపించకుండా పోయింది.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అయితే, ఏకేరావు సూసైడ్‌ చేసుకున్నారా... లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Next Story

RELATED STORIES