సినిమా

అభిమాని కోరిక తీర్చిన పూజ.. 'న్యూడ్' ఫోటో పోస్ట్ చేసి..

అందాల అరవింద 'పూజా హెగ్డే' స్టార్‌ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది.

అభిమాని కోరిక తీర్చిన పూజ.. న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి..
X

అందాల అరవింద 'పూజా హెగ్డే' స్టార్‌ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. పూజ ఉంటే సినిమా సూపర్ హిట్ అని నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ అభిమానులతో అప్పుడప్పుడూ చిట్ చాట్ చేస్తుంటుంది. వాళ్లు ఎలాంటి తిక్క ప్రశ్నలు వేసినా తెలివిగా ఆన్సర్ ఇస్తుంటుంది. పరిధి దాటి మాట్లాడుతున్నారని భావిస్తే బ్లాక్ చేయకపోగా ''నేనేంటి మరీ ఇంత చీప్‌గా ప్రవర్తించాను'' అని అనుకులా వారికి రిప్లై ఇస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కి ప్రశ్నకి ఊహించని సమాధానం ఇచ్చింది. కాలితో తన్ని నట్టు ఉన్న ఆ సమాధానానికి సదరు నెటిజన్‌కి బుద్ధివచ్చి ఉంటుంది. ఇంతకీ అతడేమి అడిగాడో తెలుసా.. ఆమె న్యూడ్ ఫోటో పంపించమన్నాడు. దానికి పూజ అతడికి ఏమాత్రం చీవాట్లు పెట్టకుండా.. తెలివిగా కాళ్లు మాత్రమే తీసిన ఫోటోని పోస్ట్ చేసింది. దీంతో సదరు నెటిజన్ కంగుతిన్నాడు.

మరొకరు పూల్‌లో ఉన్న ఫోటోని షేర్ చేయమంటే పూల బికినితో ఉన్న ఫోటోని షేర్ చేసింది. మరో నెటిజన్ అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోని షేర్ చేయమంటే ఆయన తనయుడు అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే.. ప్రభాస్‌తో నటించిన రాథేశ్యామ్ చిత్రం, అక్కినేని అఖిల్‌తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.Next Story

RELATED STORIES