Poonam Kaur: యూట్యూబ్ ఛానెళ్లపై పూనమ్ కౌర్ ఫైర్.. యాక్షన్ తప్పదంటూ..

Poonam Kaur (tv5news.in)

Poonam Kaur (tv5news.in)

Poonam Kaur: తప్పు థంబ్ నెయిల్స్‌తో, మార్ఫింగ్ ఫోటోలతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు.. పూనమ్ గురించి ప్రచారం చేస్తున్నాయి.

Poonam Kaur: గత కొంతకాలంగా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో పూనమ్ వేసే ట్వీట్లు గతకొంతకాలంగా టాలీవుడ్‌లో దూమారాన్నే రేపుతాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా.. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్.. తాజాగా రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది. 'నాతిచరామి' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది పూనమ్.

నాతిచరామి సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ ప్రెస్ మీట్‌లో చాలాకాలం తర్వాత ఇలా ఓ సినిమా కోసం అందరి ముందుకు వచ్చానని చెప్తూ పూనమ్ ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా తన కెరీర్‌లోని కొన్ని చేదు గుర్తులను మరోసారి అందరితో పంచుకుంది. ఈ విషయాలన్నింటిని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పు థంబ్ నెయిల్స్‌తో విడుదల చేశాయి.

తప్పు థంబ్ నెయిల్స్‌తో, మార్ఫింగ్ ఫోటోలతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు.. పూనమ్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఇది నచ్చని పూనమ్ కౌర్.. తన మూవీ టీమ్‌తో కలిసి ఓ లేఖను విడుదల చేశారు.

'మీడియా మిత్రులకు నమస్కారం. తాజాగా జరిగిన నాతిచరామి మూవీ ప్రెస్ మీట్ వీడియోలపై ఎవరైతే అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ వాడారో.. వాళ్లందరీ థంబ్ నెయిల్స్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాము.. సో మాట్లాడని విషయాలను వక్రీకరించి థంబ్ నెయిల్స్ పెట్టిన అందరిపైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం' అంటూ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story