సినిమా

Prakash Raj - Manchu Vishnu : ఒకే ఒక సినిమాలో కలిసి నటించిన ప్రకాష్‌‌రాజ్, మంచు విష్ణు .. !

Prakash Raj - Manchu Vishnu : ఇప్పటివరకు 'మా' ఎన్నికలు అంటే ఇండస్ట్రీకి చెందినవి మాత్రమే.. అధ్యక్ష పదవి అంటే ఏకగ్రీవమే..

Prakash Raj - Manchu Vishnu :  ఒకే ఒక సినిమాలో కలిసి నటించిన ప్రకాష్‌‌రాజ్, మంచు విష్ణు .. !
X

Prakash Raj - Manchu Vishnu : ఇప్పటివరకు 'మా' ఎన్నికలు అంటే ఇండస్ట్రీకి చెందినవి మాత్రమే.. అధ్యక్ష పదవి అంటే ఏకగ్రీవమే.. కానీ మరో మూడు రోజుల్లో జరగబోయే 'మా' ఎన్నికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫుల్ కాంట్రవర్సీ. జనరల్ ఎలక్షన్‌‌ని తలపిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ప్రకాష్‌‌రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేపోటీగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. దీనితో ఈ సారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇందులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికలను కాస్త పక్కన పెడితే వీరిద్దరూ మంచి నటులే.. విలక్షణ నటుడిగా ప్రకాష్‌‌రాజ్ కి ఆల్రెడీ మంచి పేరుంది.. ఎలాంటి పాత్రైనా సరే ఆయన అవలీలగా పోషిస్తారు. అటు విష్ణు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. జయాపజయాలను లెక్క చేయకుండా దూసుకుపోతున్నాడు. అయితే వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక సినిమాలో కలిసి నటించడం విశేషం. ఆ సినిమానే 'వస్తాడు నా రాజు'.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు మంచు, తాప్సీ పన్నూ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్‌‌రాజ్ నరసింహ అనే విలన్ పాత్రలో నటించారు. 2011లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదని అనిపించింది.

Next Story

RELATED STORIES