Prakash Raj: 'మా'కు ఇల్లు లేదు.. అందరూ నన్ను కావాలనుకుంటున్నారు.. : ప్రకాష్ రాజ్

Prakash Raj: మాకు ఇల్లు లేదు.. అందరూ నన్ను కావాలనుకుంటున్నారు.. : ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అందులో ఒకరు కావడం కొందరికి మింగుడు పడని అంశంగా మారింది.

Prakash Raj: ఈసారి మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అధ్యక్ష బరిలో హేమాహేమీలు పోటీ చేయడమే అందుకు కారణం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అందులో ఒకరు కావడం కొందరికి మింగుడు పడని అంశంగా మారింది. ఆయన నాన్ లోకల్ అంటూ కొందరు చర్చలకు తెర తీస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన ప్రకాష్ రాజ్.. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడే నాకు ఆధార్డ్ కార్డ్ ఉంది.

నా కొడుకు ఇక్కడ స్కూల్లోనే చదువుతున్నాడు. అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అని ఎవరూ అనలేదు. అంతెందుకు హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రులని కేసీఆర్ నాన్ లోకల్ అని అనట్లేదు. తమిళ నటుడు విశాల్ తెలుగు వ్యక్తి. అయినా అక్కడి అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచాడు. ఈ కామెంట్స్ చేసే వారి స్థాయి, సంకుచిత మనస్థత్వం, మానసిక పరిస్థితిని మనం గమనించాలి.

మా అధ్యక్ష ఎన్నికలల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం ఒక్కరోజులో జరిగింది కాదు. ఈ పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది. ఇక్కడ జరుగుతున్న విషయాలను చూస్తూ ఊరుకోవడం మంచిది కాదనిపించింది. ఊరికే అది బాలేదు, ఇది బాలేదు అని ఫిర్యాదు చేయడం కాదు.. పని చేసి చూపించాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

సమస్యలకు పరిష్కారం కనుగొనాలనుకున్నాను. నాలా ఆలోచించే వారితో కలిసి ఓ టీమ్ తయారు చేసుకున్నాను. తెలుగు ఇండస్ట్రీ పెద్ద రాజకీయ పార్టీ కాదు.. ఇందులో మొత్తం ఓటర్లు ఓ వెయ్యి మంది ఉంటారు. ఎన్నికల వరకే పోటీ ఉండాలి. ఆ తరువాత అందరూ కలిసే ఉండాలి. ఒక ఆర్టిస్ట్ కొడుకు 'మా' అసోసియేషన్‌కు వస్తే మా నాన్న ఆర్టిస్ట్ అని గర్వంగా ఫీలవ్వాలి. ఆ నమ్మకం అసోసియేషన్ ఇవ్వగలగాలి. మా ప్యానల్‌లోని సభ్యులంతా రేపు నేను ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగగలిగిన వారు అని ప్రకాష్ రాజ్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story