సినిమా

Preetham Jukalker: నన్ను కాపాడండి ప్లీజ్: సమంత పర్సనల్ డిజైనర్

Preetham Jukalker: ఈరోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మనసులు కలవకపోతే విడిపోవడం చాలా కామనే.

Preetham Jukalker: నన్ను కాపాడండి ప్లీజ్: సమంత పర్సనల్ డిజైనర్
X

Preetham Jukalker: ఈరోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మనసులు కలవకపోతే విడిపోవడం చాలా కామనే. కానీ అదే పని సెలబ్రిటీలు చేస్తే వారిపైనే ప్రజల దృష్టంతా ఉంటుంది. కొన్నిరోజులు సినీ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్‌గా మారుతుంది. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య విడాకుల గురించే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇన్స్‌పైరింగ్ కపుల్ అనుకున్న వారిద్దరు మ్యుచువల్‌‌గానే విడిపోయారు. కానీ వారి విడాకుల వెనుక కారణమేంటో అంతుచిక్కక ఫ్యాన్స్ అంతా అయోమయంలో ఉండిపోయారు. ఆ కారణం వారు బయటపెట్టకపోవడంతో దానిపై రోజుకొక కథనం పుట్టుకొస్తోంది. పర్సనల్ డిజైనర్ ప్రీతమ్, సమంత కలిసున్న ఫోటోలను వెతికి మరీ వెలికితీసే పనిలో ఉన్నారు కొందరు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ జుకల్కర్‌ను అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.అందులో భాగంగానే పలువురు వ్యక్తులు తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, ఉన్నపళంగా వారి అకౌంట్‌ను రిపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసాడు జుకాల్కర్. అతను పెట్టిన ఈ స్టోరీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ట్రోల్స్‌ను తట్టుకోలేని జుకాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ సెక్షన్‌ను డిజేబుల్ చేసాడు. మొత్తానికి చైసామ్‌ల విడాకులు జుకాల్కర్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.Next Story

RELATED STORIES