సినిమా

Preetham Jukalker: చైతూ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చుంటే అన్నింటికీ చెక్ పడేది: ప్రీతమ్ జుకల్కర్

Preetham Jukalker: చైసామ్ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించినప్పటి నుండి వదంతులు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Preetham Jukalker: చైతూ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చుంటే అన్నింటికీ చెక్ పడేది: ప్రీతమ్ జుకల్కర్
X

Preetham Jukalker: నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించినప్పటి నుండి ఎన్నో వదంతులు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ క్యూట్ కపుల్.. ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు?.. అంతలా వారిద్దరి మధ్య ఏం జరిగింది?.. అనే ప్రశ్నలు అభిమానుల నుండి వెల్లువెత్తాయి. అయితే చాలారోజులు మౌనంగా ఇవన్నీ భరించిన సమంత ఇటీవల వీటిపై స్పందించింది. తాజాగా తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ కూడా వీటిపై తన మనసులో మాట చెప్పాడు.

సమంత, నాగచైతన్య మధ్య ఏం జరిగిందని తెలుసుకుందామని టాలీవుడ్‌లో పెద్దలు కానీ, వారి స్నేహితులు, సన్నిహితులు కానీ ఎంత ప్రయత్నించినా వారి నుండి తొలుత ఎలాంటి స్పందన లేదు. దీంతో సమంత పిల్లల్ని కనడానికి ఒప్పుకోలేదని మొదట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో జుకల్కర్‌తో సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీనిపై సామ్ ఎలాంటి వివరణ ఇవ్వకపోయినా జుకల్కర్ దీన్ని ఖండిస్తూ వచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి వీటిపై స్పందించాడు జుకల్కర్. తాను సమంతను జీజీ అని పిలుస్తానని, జీజీ అంటే అక్క అని అర్థమని చెప్పుకొచ్చాడు. అక్కను అభిమానిస్తున్నానని చెప్పడం తప్పా? అని ప్రశ్నించాడు. ఆ ఒక్క మాటను అడ్డుగా పెట్టుకొని అందరూ ఏదేదో మాట్లాడడం న్యాయమేనా అని అడిగాడు.

ఒక అమ్మాయి అప్పటికే బాధలో ఉన్నప్పుడు తనను మళ్లీ మీ మాటలతో ఎలా బాధపెట్టగలుగుతారని జుకల్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమంతకు, తనకు మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి చైతన్యకు కూడా తెలుసని చెప్పాడు. ఇలాంటి రూమర్స్ వస్తున్నప్పుడు ఇవన్నీ అబద్ధమని చైతూ ఒక్క మాట చెప్పుంటే ఇవన్నీ వెంటనే ఆగిపోయేవి అని అన్నాడు. అయినా తను మౌనంగా ఉండడం చాలా బాధగా అనిపించిందని చెప్పాడు.

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ఫ్యాన్స్ వల్లే ఇలాంటి వదంతులు మొదలవుతాయని వారి అభిమానులను విమర్శించాడు. చైతూ ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చుంటే వీటన్నింటికి చెక్ పడేది అన్నాడు జుకల్కర్. తన కెరీర్‌ను నాశనం చేస్తామని, తాను ఇంటి నుండి బయటికి వెళ్తే చంపేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పాడు.

ఏది ఏమైనా సమంత బాధలో ఉన్నప్పుడు తాను సామ్‌కు అండగా ఉంటానని వెల్లడించాడు జుకల్కర్. ఈ వదంతులు, బెదిరింపులు తననేమీ చేయలేవన్నాడు. అలా తనను ట్రోల్ చేసేవారికి ప్రీతమ్ జుకల్కర్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

Next Story

RELATED STORIES