సినిమా

Premi Viswanath: త్వరలోనే టాలీవుడ్ వెండితెరపై మెరవనున్న ప్రేమి విశ్వనాథ్..

Premi Viswanath: సీరియళ్లు అనేవి బుల్లితెరపై ఓ చిన్న సైజ్ విప్లవాన్నే సృష్టించాయి.

Premi Viswanath (tv5news.in)
X

Premi Viswanath (tv5news.in)

Premi Viswanath: సీరియళ్లు అనేవి బుల్లితెరపై ఓ చిన్న సైజ్ విప్లవాన్నే సృష్టించాయి. ముఖ్యంగా హోమ్ మేకర్స్‌కు చాలా దగ్గరయిన వాటిల్లో సీరియల్స్ కూడా ఒకటి. ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత.. ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న సమయంలో ఆడవారికి తోడుగా దొరికాయి ఈ సీరియళ్లు. అంతే వారు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టారు.

చాలామంది సీరియళ్లను రియల్‌లాగా ఫీల్ అవుతూ.. అందులోని విలన్స్‌పై ద్వేషం పెంచుకుంటూ.. ప్రపంచాన్నే మర్చిపోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అంతే కాదు.. అసలు ఆ సీరియల్స్ ఎలా చూస్తారో అని తిట్టుకుంటూ.. చూసేవారు కూడా ఉన్నారు. అలా ప్రేక్షకుల ఆదరణతో ఎన్నో సంవత్సరాలు నడిచిన సీరియళ్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 'కార్తీక దీపం'.

అప్పటివరకు వచ్చిన సీరియల్స్‌లాగా ఇందులో హీరోయిన్ ఫుల్ మేకప్‌తో కనిపించదు. ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోదు. నలుపు ఛాయతో చూడడానికి మామూలు అమ్మాయిలాగా ఉంటుంది. కానీ తన ఆత్మవిశ్వాసమే తన బలం. ఇలాంటి ఒక అమ్మాయిని హీరోయిన్ అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానంతోనే 'కార్తీక దీపం' సీరియల్ మొదలయ్యింది. కానీ దీని సక్సెసే దీనికి సమాధానం చెప్పింది.

ముఖ్యంగా కార్తీక దీపం సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ దక్కాల్సింది అందులోని హీరోయిన్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కే. ఈరోజు ఎంతోమంది ప్రేమగా ఆదరించే వంటలక్క పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. తెలుగులో ఆదరణ సంపాదించుకున్నా కూడా ప్రేమి తెలుగమ్మాయి కాదు.. తానొక మలయాళ కుట్టి.

ప్రేమి విశ్వానథ్‌పై, కార్తీక దీపం సీరియల్‌పై ఎన్నో ఫన్నీ మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని ఎంజాయ్ చేస్తానని చెప్తోంది ప్రేమి. కార్తీక దీపం సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకున్నా కూడా తాను ఇతర సీరియల్స్ ఏమీ సైన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది ప్రేమీ విశ్వనాథ్. కాకపోతే పలు తెలుగు సినిమాల్లో మాత్రం త్వరలోనే కనిపించనుందట.

Next Story

RELATED STORIES