PM Modi : సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది : ప్రధాని మోదీ

PM Modi :  సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది : ప్రధాని మోదీ
PM Modi : అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది.

PM Modi : నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ వినీలాకాశంలో సిరివెన్నెల కురిపించిన ఆ కలం ఆగిపోయింది.. తెలుగు పదాన్ని అనాథను చేసి వసంతం వెళ్లిపోయింది.. తెలుగు సినీ పరిశ్రమలో అంతులేని విషాదాన్ని నింపి వెళ్లిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రీ.. న్యూమోనియాతో బాధపడుతూ ఈనెల 24న కిమ్స్‌లో చేరిన సీతారామశాస్త్రీ.. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిరివెన్నెల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

సీతారామశాస్త్రీ మరణం పైన దేశప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.. " అంటూ తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని. కాగా సీతారామశాస్త్రీ అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story