Production No .1 : అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో 'ప్రొడక్షన్ నెం. 1'

Production No .1 : అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం. 1
మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన 'వకీల్ సాబ్' బ్యూటీ

'మల్లేశం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ మరో కొత్త సినిమాతో అలరించనున్నారు. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో 'ప్రొడక్షన్ నెం. 1' గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సెట్ లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. దాంతో పాటు ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ తెలిపింది

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కాగా రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఈ మూవీలో రవితేజ మహదాస్య హీరోగా నటిస్తుండగా.. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు ఈ సినిమాలో ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.


అందం, అభినయంతో అనన్య ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకుంది. మల్లేశం సినిమా ఆమెకు మరింత పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత చేసిన పవర్ స్టార్ 'వకీల్ సాబ్' లాంటి భారీ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసి, పాపులారిటీ తెచ్చుకుంది. అలా వరుసగా 'ప్లే బ్యాక్', 'మ్యాస్ట్రో', 'శాకుంతలం', 'మళ్లీ పెళ్లి' వంటి చిత్రాలతో అనన్య అలరించింది. ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న ఈ బ్యూటీ.. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె అప్ కమింగ్ సినిమా పోస్టర్లను విడుదల చేశారు.

ప్రస్తుతం అనన్య చేతులో భారీగా సినిమా ఆఫర్లు ఉన్నాయి. అందులో 'బహిష్కరణ' కాగా, 'లేచింది మహిళా లోకం', 'అన్వేషీ', 'నవాబు', 'తంత్ర' సినిమాలతో కలిపి మొత్తం 7 సినిమాల్లో హీరోయన్ గా నటిస్తోంది. అందులో 'ప్రొడక్షన్ నెం.1' అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story