RAPO Skanda: ‘చుట్టూ చుట్టూ’ సాంగ్ ప్రోమో రిలీజ్

RAPO Skanda: ‘చుట్టూ చుట్టూ’ సాంగ్ ప్రోమో రిలీజ్
ఎనర్జిటిక్ స్టెప్పులతో వెండితెరపై అదరగొట్టనున్న రామ్, శ్రీలీల

ఉస్తాద్ రామ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’పై ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలోని ‘నీ చుట్టు నీ చుట్టు’ అనే తొలి గీతాన్ని ఈ నెల 3న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను, దాంతో పాటు పాట ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటి లాగే రామ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో రఫ్పాడించగా.. శ్రీలీల కూడా తనకు పోటీగా కాలు కదుపుతూ దుమ్ము దులిపేసింది.

‘యాక్షన్‌, ఎమోషన్స్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని, రామ్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్రబృందం ఇప్పటికే పేర్కొంది. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనుల్లో నిమగ్నమై ఉంది. అయితే తాజా ప్రకటన ప్రకారం ‘నీ చుట్టు నీ చుట్టు’ ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 3న అంటే గురువారం ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోలో రామ్ మందపాటి గడ్డంతో మాస్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సాంగ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. ఎస్‌ఎస్ థమన్ ఈ సినిమా కోసం రాకింగ్ ఆల్బమ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ రెడ్, వారియర్ లాంటి సినిమాల్లో కనిపించినా అవి పెద్దగా విజయాన్ని అయితే అందించలేకపోయాయి. దీంతో ఈ సినిమాతో ఆయన ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే అభిమానుల్ని బాగానే ఆకట్టుకోగా.. ఇప్పుడు పాటలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.



Tags

Read MoreRead Less
Next Story