సినిమా

Puneeth Rajkumar: పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకోనున్న ప్రేమికులు.. ఎందుకంటే..!

Puneeth Rajkumar: ఒక్కసారి ప్రజలు అభిమానం పెంచుకున్నారంటే.. దానికి హద్దులు లాంటివి ఏమీ ఉండవు.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: ఒక్కసారి ప్రజలు అభిమానం పెంచుకున్నారంటే.. దానికి హద్దులు లాంటివి ఏమీ ఉండవు. ముఖ్యంగా ఇలాంటి హద్దుల్లేని అభిమానాన్ని సంపాదించుకోగల అదృష్టం సినిమావారికే ఉంటుంది. అందుకే తాము ఎంతగానో ఆదరించే నటీనటులకు ఏమైనా జరిగితే ప్రేక్షకులు తట్టుకోలేరు. ఇటీవల పునీత్ రాజ్‌కుమార్ మరణం వల్ల కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా పునీత్ అభిమానులు ఇద్దరు తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పునీత్ రాజ్‌కుమార్‌ను కంఠీరవలో ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే దహనం చేశారు. అయితే ఆయన సమాధిని సందర్శించుకునే అవకాశాన్ని కూడా కుటుంబసభ్యులు కల్పించారు. దీంతో పెద్ద సంఖ్యలో పునీత్ అభిమానులు కంఠీరవకు చేరుకుని ఆయన సమాధిని సందర్శించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఓ ప్రేమజంట కూడా పునీత్ సమాధిని సందర్శించుకున్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ఓ జంట పునీత్ సమాధిని సందర్శించడమే కాక అక్కడే తమ పెళ్లి జరగాలని నిర్ణయించుకున్నారు. దీనికి పునీత్ అన్న శివరాజ్‌కుమార్ అనుమతి కూడా తీసుకున్నారట. ఎన్నో రకాలుగా ఇప్పటికే పునీత్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుతుండగా.. పునీత్ సమక్షంలో తమ పెళ్లి చేసుకుని ఈ జంట ఈ విధంగా తమ అభిమానాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES