సినిమా

Puneeth Rajkumar : సేవా కార్యక్రమాల కోసం పునీత్ రూ. 8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌...!

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంతమంది అభిమానులు అయితే ఏకంగా ఆత్మహత్యలకి కూడా పాల్పడుతున్నారు..

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంతమంది అభిమానులు అయితే ఏకంగా ఆత్మహత్యలకి కూడా పాల్పడుతున్నారు.. ఆయనని చివరిసారి చూసేందుకు అభిమానులు కరోనాని కూడా లెక్కచేయకుండా వందల, వేల సంఖ్యల్లో కంఠీరవ స్టేడియానికి తరలివచ్చారు. అయితే ఇంతమంది అభిమానులను పునీత్ కేవలం హీరోగా సంపాదించుకోలేదు.

ఆయన చేపట్టిన ఎన్నో సేవ కార్యక్రమాలతో, స్టార్ హీరో అయినప్పటికీ ఇతర హీరోలతో కలిసిమెలిసి ఉండడం, అభిమానులతో ప్రేమగా ఉండడం ఇవన్ని అభిమానుల గుండెల్లో ఆయనని రియల్ హీరోగా నిలబెట్టాయి. అంతేకాకుండా పునీత్ ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు చదువు నడుస్తున్నాయి. చివరికి ఆయన మరణాంతరం కూడా తన రెడు కళ్లు కూడా దానం చేశారు.

అయితే ఇవన్ని పునీత్ చనిపోయేవరకు ఎవరి కూడా తెలియదు. అయితే తాను లేకపోయిన తాను చేపట్టిన సేవ కార్యక్రమాలు ముందుకు సాగాలని పునీత్‌ వాటి పేరుతో 8 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.

Next Story

RELATED STORIES