సినిమా

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు తీసిన వర్కవుట్స్?

Puneeth Rajkumar: సినిమా వారు స్క్రీన్‌పై అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: సినిమా వారు స్క్రీన్‌పై అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయిదు నిమిషాల సీన్ అయినా ఫిట్‌‌గా కనిపించడానికి ఎన్నో నెలలు కష్టపడాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఈమధ్య హీరోహీరోయిన్లు అందరూ అయితే షూటింగ్ సెట్‌లో లేదా జిమ్‌లోనే కనిపిస్తు్న్నారు. కొన్ని రిస్కీ వర్కవుట్స్ వల్ల కూడా నటీనటులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అన్నదాంట్లో సందేహం లేదు.

ఏదైనా కొంచెం తీసుకున్నా ప్రమాదకరమే.. అతిగా తీసుకున్నా ప్రమాదకరమే.. కానీ సినిమా వారికి ఈ రెండు తప్పవు. క్యారెక్టర్‌కు సూట్ అయ్యేలా ఉండాలంటే ఒక్కొక్కసారి వారు అధిక బరువు పెరగాల్సి ఉంటుంది. మళ్లీ వెంటనే ఫిట్‌గా అయిపోవాల్సి ఉంటుంది. దీని వల్ల వారు చాలా కఠినమైన డైట్‌లు ఫాలో అవ్వడం, రిస్కీ వర్కవుట్స్ చేయడం లాంటివి తప్పవు. దాని వల్లే అనుకోని పరిణామాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

పునీత్ రాజ్‌కుమార్ ఇవాళ ఉదయం వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. రోజులాగానే ఈరోజు జిమ్‌కు వెళ్లారు. తన అప్‌కమింగ్ చిత్రాల్లో ఫిట్‌గా, బాడీ బిల్డర్‌గా కనిపించడానికి గత కొన్నిరోజులుగా పునీత్.. చాలా కఠినమైన ఎక్సర్సైజ్‌లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా వర్కవుట్ చేస్తూనే ఉన్నపళంగా కుప్పకూలిపోయి మరణించారు పునీత్.

చాలా రిస్కీ వర్కవుట్స్ గుండెకు అంత మంచివి కావు. అవి గుండెపై అధిక ఒత్తిడిపడేలా చేస్తాయి. ఎంత ఫిట్‌గా ఉండాలనుకున్నా కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండడం మంచిదే అంటున్నారు వైద్యులు. వయసును బట్టి, హార్ట్ హెల్త్‌ను బట్టి డైట్‌ను, ఎక్సర్సైజ్‌‌ను ఫాలో అవ్వాలి అంటున్నారు.

Next Story

RELATED STORIES