సినిమా

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత..?

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత..?
X

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చెందారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ హార్ట్‌ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఉదయం జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా రాజ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే పునీత్‌ను బెంగళూరు విక్రం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ కాపాడే ప్రయత్నం చేశారు వైద్యులు. అయితే, తాము ఎంత ప్రయత్నించినా పునీత్‌ను కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే రాజ్‌కుమార్‌ చనిపోయినట్టు వైద్యుల ప్రకటించారు. కాసేపట్లో రాజ్‌కుమార్‌ మరణవార్తను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఉదయం 9 గంటల 45 నిమిషాలకు పునీత్‌ రాజ్‌కుమార్‌కు సడెన్‌ హార్ట్‌స్ట్రోక్‌ వచ్చింది. అప్పటికే, గుండెపోటుతో విలవిలలాడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం పదకొండున్నరకు ఆస్పత్రికి తీసుకొచ్చారని బెంగళూరు విక్రం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆస్పత్రికి వచ్చే సమయానికే.. ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెంటనే అత్యవసర వైద్య చికిత్స మొదలుపెట్టామని, వెంటిలేటర్‌పై చికిత్స అందించామని చెప్పుకొచ్చారు. ఎంతసేపు ప్రయత్నించినా.. పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయామని విక్రం ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Next Story

RELATED STORIES