సినిమా

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌ను తన తండ్రితో కలిపిన ఫోటో ఎడిట్.. ఫ్యాన్స్‌కు ఎమోషనల్ గిఫ్ట్..

Puneeth Rajkumar: ఏదో ఒకరోజు మరణాన్ని ఎదుర్కోవాల్సిందే అన్న నిజాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎంతో సాఫీగా జీవించేస్తుంటాం.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: ఎవరైనా ఏదో ఒకరోజు మరణాన్ని ఎదుర్కోవాల్సిందే అన్న నిజాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎంతో సాఫీగా జీవించేస్తుంటాం. కానీ ఆ మరణం అనూహ్యంగా వచ్చినప్పుడు మన అనుకునే వాళ్లు దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ విషయంలో కూడా అదే జరిగింది. అప్పటివరకు తమతో సరదాగా ఉన్న మనిషి అకస్మాత్తుగా అలా మరణించడం అందరినీ కలచివేస్తోంది. అందుకే ఆయన తిరిగొస్తే బాగుండు అని చాలామంది కోరుకుంటున్నారు.

చనిపోయిన వారు తిరిగి రాకపోవచ్చు కానీ.. వారికి సంబంధించిన ఎన్నో అనుభవాలను మనతో వదిలేసి వెళతారు. అవన్నీ చూసినప్పుడు వారు మనతోనే ఉన్నారన్న అనుభూతి కలుగుతుంది. ప్రముఖ ఫోటో ఎడిటర్ కరణ్ ఆచార్య చేసిన ఫోటో ఎడిట్ చూస్తుంటే అలాంటి ఒక అనుభూతే కలుగుతుంది. అప్పు మనల్ని వదిలేసి వెళ్లిపోయాడని అందరం బాధపడుతున్నాం కానీ కరణ్ మాత్రం తన అభిమానుల్లో బాధపోగొట్టడానికి వినూత్నంగా ఆలోచించాడు.

పునీత్ రాజ్‌కుమార్ మరణించినా.. మన లోకాన్ని విడిచి తన తండ్రి ఉంటున్న మరో లోకానికి వెళ్లిపోయాడన్న అర్థం వచ్చేలా కరణ్ ఆచార్య ఒక ఫోటోను ఎడిట్ చేశాడు. అది చూసిన వారి మనసు ఒక్కసారిగా చివుక్కుమనకుండా ఉండదు. కరణ్ ఆచార్య ఇప్పటికీ ఎంతోమందిని కదిలించే ఎన్నో ఫోటో ఎడిట్‌లను చేశాడు. కానీ ఇది మాత్రం తన బెస్ట్ అని నెటిజన్లు తనను ప్రశంసిస్తున్నారు.


Next Story

RELATED STORIES