సినిమా

Puneeth Rajkumar: ఆ హీరోతో కలిసి నటించడం పునీత్ కోరిక.. కానీ అది తీరకుండానే..

Puneeth Rajkumar: తరువాతి నిమిషం ఏం జరుగుతుందో కనీసం ఊహించలేని విధంగా బతుకుతున్నాం అందరం.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: తరువాతి నిమిషం ఏం జరుగుతుందో కనీసం ఊహించలేని విధంగా బతుకుతున్నాం అందరం. అప్పటివరకు మన కళ్ల ముందు ఉన్న మనిషి కూడా కాస్త పక్కకు వెళ్లగానే మళ్లీ తిరిగి వస్తారో రారో చెప్పలేకపోతున్నాం. పునీత్ రాజ్‌కుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. రోజులాగే జిమ్‌‌కు వెళ్లిన రాజ్‌కుమార్ తిరిగి రాలేదు. ఆయన అకాల మరణం వల్ల కుటుంబ సభ్యులతో పాటు, సౌత్ ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఆయనకొక చివరి కోరిక ఉండేదని ఓ దర్శకుడు వెల్లడించారు.

ఎన్‌టీఆర్ తెలుగులో తీసిన 'ఆంధ్రావాలా' సినిమాను కన్నడలో 'వీర కన్నడిగ'గా రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. దీనికి తెలుగు దర్శకుడు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. వీర కన్నడిగతోనే మెహర్ రమేశ్ దర్శకుడిగా పరిచయం అయ్యరు. పునీత్ పార్థివదేహాన్ని చూడడానికి వచ్చిన మెహర్ రమేశ్.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన ఆఖరి కోరికను బయటపెట్టారు.

పునీత్ రాజ్‌కుమార్‌తో తాను రెండు సినిమాలు చేశానని గుర్తుచేసుకున్నారు మెహర్ రమేశ్. తననొక ఇంటి సభ్యుడిగా చూసుకునేవారు అన్నారు. చిరంజీవితో 'భోళా శంకర్' సినిమా అనౌన్స్ చేసినప్పుడు పునీత్ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. చిరంజీవితో నటించడం తన కోరిక అని, ఆ సినిమాలో ఏదైనా సన్నివేశంలో నటించే అవకాశం ఉంటే చెప్పమని పునీత్ అన్నట్టు వెల్లడించారు మెహర్ రమేశ్. ఆయనతో కలిసి ఒక స్టెప్పేసినా చాలని అన్నారని చెప్పుకొచ్చారు. కానీ ఆ కోరిక తీరకుండానే పునీత్ అందరికీ దూరమయిపోయారు.

Next Story

RELATED STORIES