Pushpa Movie: 'పుష్ప' టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తున్న అల్లు అర్జున్..

Pushpa Movie (tv5news.in)

Pushpa Movie (tv5news.in)

Pushpa Movie: ఎర్రచందనం దొంగతనాలపై ‘పుష్ప’ సినిమా కథ ఉంటుందన్న విషయం ఇప్పటికీ చాలామందికి క్లారిటీ వచ్చేసింది.

Pushpa Movie: ఎర్రచందనం దొంగతనాలపై 'పుష్ప' సినిమా కథ ఉంటుందన్న విషయం ఇప్పటికీ చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ప్రతీ విషయంలో కరెక్ట్‌గా, క్లారిటీగా ఉండాలనుకునే సుకుమార్.. ఇలాంటి ఓ కథ సెలక్ట్ చేసుకుని, దానిని చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. అందుకే నిజమైన లొకేషన్లలో షూట్ చేశారు. తాజాగా పుష్ప టీమ్ మూవీకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

'పుష్ప' సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల్లో, ఔట్‌డోర్‌లోనే జరిగింది. అందుకే ఈ సినిమాకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు ముందే బయటికి వచ్చేశాయి. ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకుండా మూవీ టీమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీక్స్ మాత్రం ఆగలేదు. అలా ఇప్పటికీ ఎన్నో మేకింగ్ వీడియోలు నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పుష్ప షూటింగ్ మళ్లీ ప్రారంభించినప్పుడు ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసింది టీమ్. మళ్లీ ఇన్నిరోజుల తర్వాత మరో మేకింగ్ వీడియోతో మన ముందుకు వచ్చింది. ఇక దీంట్లో బన్నీ.. పుష్ప టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు. ఎవరూ ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని, వారు రాకముందు ఆ ప్రాంతం ఎలా ఉందో.. వెళ్లేటప్పుడు కూడా అలాగే ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story