సినిమా

Pushpa Movie: 'పుష్ప' నుండి సమంత స్పెషల్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..

Pushpa Movie: సమంత ఇప్పటివరకు తన కెరీర్ గెస్ట్‌గా చేసిన పాత్రలే చాలా తక్కువ.

Pushpa Movie (tv5news.in)
X

Pushpa Movie (tv5news.in)

Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా మీద ఆడియన్స్‌‌లో ఆసక్తి పెంచడానికి మూవీ టీమ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సమంతను స్పెషల్ సాంగ్ కోసం సెలక్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ముందు షాక్ అయినా సినిమా కోసం దర్శక నిర్మాతల ప్లాన్ అదుర్స్ అని మెచ్చుకుంటున్నారు.

సమంత ఇప్పటివరకు తన కెరీర్ గెస్ట్‌గా చేసిన పాత్రలే చాలా తక్కువ. అందులోనూ ఒకేసారి ఇలాంటి స్పెషల్ సాంగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే అదే ప్రేక్షకులకు పెద్ద న్యూస్. ఇక తాజాగా ఈ సినిమా నుండి సమంత చేసిన 'ఓ అంటావా.. ఓ ఓ అంటావా' అనే పాట ఎప్పుడు విడుదల అవుతుందో మూవీ టీమ్ రివీల్ చేసింది. డిసెంబర్ 10న ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల కానుందని ఓ పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది.


Next Story

RELATED STORIES