సినిమా

Pushpa Movie: పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Pushpa Movie: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు.

Pushpa Movie (tv5news.in)
X

Pushpa Movie (tv5news.in)

Pushpa Movie: సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. వీరిద్దరు కలిసి చేసిన ఆర్య, ఆర్య 2 సినిమాలు.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథలు. అయితే ఆ రెండిటికి భిన్నంగా ఈసారి 'పుష్ప' అనే ఒక మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇప్పటకే ఈ సినిమా గురించి ప్రతీ అంశం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేయాలో మూవీ టీమ్ నిర్ణయించిందట.

'పుష్ప' సినిమా నుండి ఇప్పటివరకు కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు అందరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. పుష్ప సినిమా పాటలు, టీజర్ ఒక ఎత్తు అయితే.. ఈ ఫస్ట్ లుక్స్ మాత్రమే మరో ఎత్తు. ఈ సినిమా పాటల సందడి కూడా ఎప్పుడో మొదలైపోయింది. మాస్ ఎంటర్‌టైనర్‌కు తగినట్టుగా ఉన్నాయి దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు.

పుష్పను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 17న విడుదల కానున్న మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ది రైజ్ ఆఫ్ పుష్పరాజ్ పేరుతో మూవీ టీమ్ టీజర్‌ను విడుదల చేసేసింది. తాజాగా డిసెంబర్ 2న ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని నిర్ణయించారట సుకుమార్. మరి ట్రైలర్‌లో ఈ లెక్కల మాస్టర్ ఎన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ దాచాడో..

Next Story

RELATED STORIES