సినిమా

Pushpa Remuneration: పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Pushpa Remuneration: టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పుష్ప మ్యానియా నడుస్తోంది.

Pushpa Remuneration: పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
X

Pushpa Remuneration: టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పుష్ప మ్యానియా నడుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప.. పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌‌ను మాస్ లుక్‌లో చూపించడంలో దర్శకుడు సుకుమార్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా పుష్పలో యాక్టర్ల రెమ్యునరేషన్ ఇప్పుడు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు నుండి తన ప్రతీ హిట్ సినిమాకు ఎంతో కొంత రెమ్యునరేషన్ పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ప్రస్తుతం పుష్ప కోసం అల్లు అర్జున్ రూ. 50 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్నాడట. ఇక ఇందులో విలన్ పాత్రలో నటించిన ఫాహద్ ఫాజిల్‌కు తెలుగులో ఇది తొలి చిత్రమే అయినా.. మలయాళంలో తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తనకు రూ.3.5 కోట్లు రెమ్యునరేషన్‌ అందించినట్టు సమాచారం.

పుష్పలో శ్రీవల్లిగా నటించి అందరినీ ఆకట్టుకున్న రష్మిక పారితోషికం రూ. 8 నుండి 10 కోట్ల మధ్యలో ఉంటుందట. హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు పుష్ప కోసం దర్శకుడు సుకుమార్ కూడా భారీ రెమ్యునరేషన్‌నే అందుకున్నాడు. పుష్ప కోసం దర్శకుడు సుకుమార్ రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు టాక్. సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ రూ. 3.5 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.

Next Story

RELATED STORIES