సినిమా

Pushpa OTT Release Date: 'పుష్ప' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

Pushpa OTT Release Date: అల్లు అర్జున్, సుకుమార్ బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’ థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది

Pushpa OTT Release Date: పుష్ప ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..
X

Pushpa OTT Release Date: అల్లు అర్జున్, సుకుమార్ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ హిట్ 'పుష్ప'.. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. పుష్ప తర్వాత ఇంకే పాన్ ఇండియా సినిమా విడుదల కాకపోవడం కూడా దీని కలెక్షన్స్‌కు తోడ్పడుతుంది. న్యూ ఇయర్ రోజున మరోసారి పుష్ప కలెక్షన్ల విషయంలో దూసుకుపోయింది. ప్రస్తుతం అది ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తోంది.

2021 చివర్లో విడుదలయినా కూడా.. పుష్ప ఆ సంవత్సరం విడుదలయిన సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది. థియేటర్లలో ఇంకా సినిమా రన్ అవుతున్నందుకు కనీసం 90 రోజుల తర్వాత దీనిని ఓటీటీలో విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. కానీ మనసు మార్చుకుని సంక్రాంతి సీజన్‌లోనే విడుదలకు సిద్ధమయ్యింది.

సంక్రాంతి సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు మాత్రమే కాదు.. ఓటీటీలో సినిమాలు చూసేవారు కూడా ఎక్కువే. అందుకే సంక్రాంతి సమయంలో ఓటీటీలో విడుదల అవ్వడానికి కూడా చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి పుష్ప. జనవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప విడుదల ఖరారయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల వెలువడింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.


Next Story

RELATED STORIES