సినిమా

RRR movie : అభిమానులకి షాక్.. RRR మరోసారి వాయిదా .. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

RRR movie : అభిమానులకి షాక్.. RRR మరోసారి వాయిదా .. !
X

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా వెల్లడించింది. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయాలనీ అనుకున్నారు మేకర్స్. సినిమాలోని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదని అందుకే సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ పేర్కొంది అయితే సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమా విడుదల తేదిని త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.


Next Story

RELATED STORIES