సినిమా

Rajamouli: ఆ బాలీవుడ్ యంగ్ హీరోతో రాజమౌళి సినిమా..

Rajamouli: బ్రహ్మాస్త ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి కూడా మూవీ టీమ్‌తో పాటు చురుగ్గా పాల్గొన్నారు.

Rajamouli (tv5news.in)
X

Rajamouli (tv5news.in)

Rajamouli: 'బాహుబలి' తర్వాత రాజమౌళి రేంజే మారిపోయింది. ఏ భాష హీరో అని తేడా లేకుండా రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలని ఆశపడడం మొదలుపెట్టారు. కానీ రాజమౌళి మాత్రం దాదాపు నాలుగు సంవత్సరాలు 'ఆర్ఆర్ఆర్' తప్ప వేరే ధ్యాస లేకుండా గడిపేశారు. ఈ సినిమా విడుదల తర్వాత అయినా.. ఏమైనా క్లారిటీ వస్తుంది అనుకుంటే అది కాస్త పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. కానీ ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరోతో రాజమౌళి సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

రణభీర్ కపూర్ ఎప్పుడూ యూత్‌ఫుల్ సినిమాలతోనే ఆకట్టుకునేవాడు. తన కెరీర్‌లో రణభీర్ చేసిన ప్రయోగాలు చాలా తక్కువ. ఎక్కువగా లవ్ స్టోరీలు, యూత్‌ఫుల్ సినిమాలతోనే అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ వాటన్నిటికంటే డిఫరెంట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఇప్పటికే ఈ సినిమా నుండి రణభీర్ కపూర్ ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

బ్రహ్మాస్త ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి కూడా మూవీ టీమ్‌తో పాటు చురుగ్గా పాల్గొన్నారు. పైగా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ.. అలాంటి ఓ మైథలాజికల్ సినిమా ఎప్పుడూ చేయలేదు కాబట్టి రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం విషయంలో సాయం చేశాడని కూడా సమాచారం. అంతే కాకుండా బ్రహ్మాస్త తెలుగు వర్షన్‌కు రాజమౌళి ప్రెజెంటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్‌తో సినిమా చేద్దామనుకున్న రాజమౌళి.. అది పూర్తయిన తర్వాత రణభీర్ కపూర్‌ను హీరోగా పెట్టి మూవీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు టాక్.Next Story

RELATED STORIES