సినిమా

RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌'కు ఆ సీనే హైలెట్.. సీక్రెట్ చెప్పేసిన రాజమౌళి..

RRR Movie: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ సీతారామరాజుగా కనిపించనున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్‌కు ఆ సీనే హైలెట్.. సీక్రెట్ చెప్పేసిన రాజమౌళి..
X

RRR Movie: పాన్ ఇండియా సినిమాలు వరుసగా విడుదలకు క్యూ కట్టాయి. అందులో ఒకటైన 'పుష్ప'.. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు ఒకటి తర్వాత మరొకటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి 'ఆర్ఆర్ఆర్'.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎక్కడా తగ్గట్లేదు. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ప్రమోషన్స్‌ను దాదాపు నెల ముందు నుండే మొదలుపెట్టేశారు.

ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమాలో హీరోల ఎలివేషన్స్, యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. అయితే ఇందులో ఏ హీరో తగ్గకుండా ఇద్దరికీ పోటాపోటీ రోల్స్ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఇటీవల సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో ఓ రేంజ్‌లో వివరించాడు రాజమౌళి.

దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్ లో చరణ్ ఎంట్రీ సీన్ ఉంటుందట. ఎంట్రీ సీనే సినిమాకు హైలైట్ కానుందట. పైగా ఆ సీన్‌‌ను తీసేటప్పుడు రాజమౌళి చాలా ఎగ్జైటింగ్‌గా కూడా ఫీల్ అయ్యారట. ఆర్ఆర్ఆర్‌లో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నప్పటికీ చరణ్ ఎంట్రీ సీన్ చాలా స్పెషల్ అంటున్నారు రాజమౌళి. ట్రైలర్‌లో కూడా ఈ సీన్‌కు సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను జతచేశాడు జక్కన్న.

Next Story

RELATED STORIES