Rajamouli: 180 కోట్ల అప్పుల్లో 'ఆర్ఆర్ఆర్'? రాజమౌళిదే బాధ్యతా..?

Rajamouli: 180 కోట్ల అప్పుల్లో ఆర్ఆర్ఆర్? రాజమౌళిదే బాధ్యతా..?
Rajamouli: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్'.

Rajamouli: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న విడుదలను ఖరారు చేసుకున్న ఆర్ఆర్ఆర్.. విడుదలకు ఇంకా వారం రోజులు ఉండగా.. సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది మూవీ టీమ్. కానీ అప్పటికే థియేటర్ల డిస్ట్రిబ్యూటర్లు సినిమా కోసం చాలా డబ్బునే చెల్లించారట. ఆర్ఆర్ఆర్‌కు ప్రీ బిజినెస్ కూడా లాభాల బాటలోనే నడిచిందని టాక్. అయితే సినిమా వాయిదా పడడంతో నిర్మాత ఆ డబ్బులన్నీ తిరిగి చెల్లించేయాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ కోసం నిర్మాత డివివి దానయ్య చాలానే ఖర్చు పెట్టారు. సినిమా బడ్జెట్ గురించి ఇప్పటికే దర్శకుడు రాజమౌళి.. చాలాసార్లు బహిరంగానే వెల్లడించారు. అయితే బడ్జెట్‌కు తగినట్టుగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వాయిదా వల్ల ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ కచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉందని టాలీవుడ్ సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఆర్ఆర్ఆర్ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల దానయ్య తీసుకున్న మొత్తాన్ని ప్రస్తుతం తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అయితే కొంత మొత్తాన్ని చెల్లించిన తర్వాత కూడా ఇంకా.. 180 కోట్లు అప్పు ఆర్ఆర్ఆర్‌పై ఉందని టాక్. అయితే ఈ అప్పులో కొంత భాగాన్ని రాజమౌళి చెల్లిస్తానని హామి ఇచ్చారని టాక్. పైగా లాభాల్లో కూడా ఆర్ఆర్ఆర్ ఎక్కువ వాటానే తీసుకుంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story