సినిమా

Rajamouli: సల్మాన్ ఖాన్‌ను రాజమౌళి కలిసింది అందుకే..!

Rajamouli: ఇటీవల రాజమౌళి.. సల్మాన్ ఖాన్ ఆఫీస్ బయట కనిపించాడు.

Rajamouli: సల్మాన్ ఖాన్‌ను రాజమౌళి కలిసింది అందుకే..!
X

Rajamouli: ఇటీవల రాజమౌళి.. సల్మాన్ ఖాన్ ఆఫీస్ బయట కనిపించాడు. అప్పటినుండి అసలు ఎందుకు కలిశాడు, మ్యాటర్ ఏమయ్యింటుంది అని అందరు తెగ ఆలోచించేస్తు్న్నారు. అయితే ఎందుకు కలిశాడు అన్న ప్రశ్నకు సమాధానం ఒక రూమర్ ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు కలిసి సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారేమో అని నెటిజన్లు మొదట అనుకున్నా తర్వాత అది అబద్ధమని తేలిపోయింది.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సినిమాల్లోనే కాక బిగ్ బాస్ షోతో కూడా ఫుల్ బిజీగా గడిపేస్తు్న్నాడు. హిందీలో బిగ్ బాస్ ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుంది. అందుకే 11 సీజన్లకు సల్మాన్ ఖానే హోస్ట్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను హిందీలో ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ హిందీని అస్త్రంగా ఉపయోగించనున్నాడట రాజమౌళి.

రాజమౌళి టేకింగ్ ఎంత బాగుంటుందో.. ఆయన ప్లానింగ్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రాజమౌళి ప్లాన్ చేసి సినిమాను ప్రమోట్ చేశారంటే కచ్చితంగా ఆ సినిమాను ప్రేక్షకులు ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాల్సిందే. అయితే బహుబలి తర్వాత రాజమౌళి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆటోమాటిక్‌గా అంచనాలు పెరిగిపోయినా.. జక్కన్న మాత్రం ఎక్కడా రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న విడుదల కానుంది. అందుకే అప్పుడే ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ ప్రమోషన్స్ పనులను మొదలుపెట్టేశారు రాజమౌళి. అయితే హిందీ ప్రేక్షకులకు కూడా ఆర్ఆర్ఆర్‌ను దగ్గర చేయడానికి రాజమౌళి.. దీనిని బిగ్ బాస్ హిందీ వేదికపై ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయినట్టు.. అదే పని మీద సల్మాన్ ఖాన్‌ను కలిసినట్టు సమాచారం.

Next Story

RELATED STORIES