సినిమా

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడికి కరోనా..

Rajendra Prasad: తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడికి కోవిడ్ సోకినట్టు నిర్దారణ అయ్యింది.

Rajendra Prasad (tv5news.in)
X

Rajendra Prasad (tv5news.in)

Rajendra Prasad: టాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది సీనియర్ నటీనటులు కరోనా బారిన పడ్డారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా కూడా ఉంది. కొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్సను పొందుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడికి కోవిడ్ సోకినట్టు నిర్దారణ అయ్యింది.

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌కు స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు అన్నారు. ఇటీవల ఆహాలో విడుదలయిన 'సేనాపతి' సినిమాలో రాజేంద్రప్రసాద్ నటనకు పలువురు సెలబ్రిటీల దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్‌కు కరోనా అనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది.

Next Story

RELATED STORIES