Top

రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే.. పట్టుబడుతున్న ఫ్యాన్స్‌

ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇవాళ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు ఫ్యాన్స్‌.

రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే.. పట్టుబడుతున్న ఫ్యాన్స్‌
X

రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజనీకాంత్‌ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇవాళ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు ఫ్యాన్స్‌. ఆందోళనలకు దిగొద్దని రజనీ మక్కల్ మండ్రం వారించింది. తమిళనాడులోని 38 జిల్లాల అభిమాన సంఘాలు సైతం ఆందోళనలకు దిగొద్దని పిలుపునిచ్చాయి.

ఎవరూ ఆందోళనలో పాల్గొనకూడదని నోటీసులు కూడా ఇచ్చాయి. అయినా సరే అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. ఉదయం 7 గంటల నుంచే రోడ్ల మీదకు రావడం మొదలుపెట్టారు. చెన్నైలో సుమారు వేయి మందికి పైగా అభిమానులు.. ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకుని ఆందోళనలో కూర్చున్నారు. అభిమానుల ఆందోళన అదుపు తప్పే అవకాశం ఉందన్న వార్తలతో పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు.

Next Story

RELATED STORIES