Rajinikanth: రజినీకాంత్ 'జైలర్' కలెక్షన్ల సునామీ

Rajinikanth: రజినీకాంత్ జైలర్ కలెక్షన్ల సునామీ

సూపర్‌స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జైలర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.అభిమానులు అయితే.. రజినీకి ఇది కదా కావాల్సింది హిట్టు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌తో అన్నిచోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.మొదటి రోజే వంద కోట్ల మార్క్‌ దాటింది. ఒక్క బుక్‌ మై షో యాప్‌లోనే 9 లక్షల టికెట్లు బుక్‌ అయ్యాయంటే రజనీ క్రేజ్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమిళనాడులో 8 కోట్ల రేంజ్ ప్రీ బుకింగ్స్,కర్ణాటకలో 7 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్,దేశం మొత్తం ఈ సినిమా బుకింగ్స్ 17 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగిందని,ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి మొత్తంగా 30 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చెసుకున్నట్లు సినీ వర్గాల టాక్‌.

ఇటీవల రజినీ సినిమాల్లో రోబో 2.0 తర్వాత బెస్ట్ బుకింగ్స్ తో జైలర్ ముందంజలో ఉంది.ఇదే పాజిటివ్ టాక్.. మౌత్ టాక్ కంటిన్యూ అయింతే...సినిమా బుకింగ్స్ జోరుని మరింత పెరిగే అవకాశం ఉందని ఫిలిం వర్గాలు అంటున్నాయి.ఇండియాలో 45 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా వంద కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుంది.ఏది ఏమైనప్పటికీ రజినీ జైలర్.. ఫ్యాన్స్ కే కాకుండా.. అన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చుతుందని టాక్ వినిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story