సినిమా

Rajinikanth: అభిమానికి క్షమాపణలు చెప్పిన రజినీకాంత్.. ఎందుకంటే..

Rajinikanth: కొందరు నటీనటులు ఎంత స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న వారి అభిమానులతో, ప్రేక్షకులకు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారు

Rajinikanth (tv5news.in)
X

Rajinikanth (tv5news.in)

Rajinikanth: కొందరు నటీనటులు ఎంత స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న వారి అభిమానులతో, ప్రేక్షకులకు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారు. తాము పెద్ద స్టార్ అన్న విషయాన్ని పక్కన పెట్టి మరీ.. అభిమానులకు దగ్గరవుతారు. అలాంటి హీరోలలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎంతో కష్టపడి సొంతంగా హీరో స్టేటస్ సంపాదించుకున్న ఆయన ఎప్పుడూ అభిమానులను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆయన అభిమాని కోసం రజినీ చేసిన ఓ పని నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

తెలుగు, తమిళంలో ఎంతోమంది పెద్ద స్టార్లు తమను చాలా అభిమానించే వారి ఆరోగ్యం బాలేకపోతే.. నేరుగా కలవడం, మాట్లాడడం చేస్తుంటారు. అలా చేసిన ప్రతీసారి వారిపై అభిమానం మరింత పెరిగిపోతుంది. ఇటీవల రజినీకాంత్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి రజినీకాంత్ తనకొక వీడియో సందేశాన్ని పంపించారు.

'హలో సౌమ్య.. ఎలా ఉన్నావు? కరోనా పరిస్థితుల వల్ల, నాకు కూడా ఆరోగ్యం బాలేకపోవడం వల్ల మిమ్మల్ని నేరుగా వచ్చి కలవలేకపోతున్నందుకు క్షమించండి. ధృడంగా ఉండు. నేను నీకోసం ప్రార్థిస్తాను. మీరు త్వరలో పూర్తిగా కోలుకుంటారు. వర్రీ అవ్వకండి' అని తన అభిమానికి వీడియో సందేశం పంపించారు రజినీకాంత్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Next Story

RELATED STORIES