Rakul Preet: కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకోవాలంటే.. రకుల్ చెప్పినట్లు..

Rakul Preet: కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకోవాలంటే.. రకుల్ చెప్పినట్లు..
కోవిడ్ సమయంలో ఆందోళన మరియు ఒత్తిడిని అధిగమించడానికి రకుల్ ప్రీత్ సింగ్ బుధవారం ఒక చిట్కాను పంచుకున్నారు.

Rakul Preet: కోవిడ్ వార్తలు, కోవిడ్ సంఘటనలు, దగ్గరి బంధువుల్లో మరణాలు, ఇంట్లో వారికి పాజిటివ్.. ఒకటే టెన్షన్.. దీన్ని ఎలా అధిగమించాలి. దానికి యోగ నిద్ర చాలా ఉత్తమమైనదంటూ అందాల రకుల్ ప్రీత్ అభిమానులకు వివరిస్తుంది.

ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యతనిచ్చే నటి రకుల్ ప్రీత్ సింగ్. నటిగానే కాకుండా జిమ్, యోగా వంటి వ్యాయామాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. తాను చేస్తున్న యోగాసనాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంటుంది. తాజాగా యోగ నిద్ర చేస్తున్నట్లు ఓ ఫోటో పెట్టింది.

కోవిడ్ సమయంలో ఆందోళన మరియు ఒత్తిడిని అధిగమించడానికి రకుల్ ప్రీత్ సింగ్ బుధవారం ఒక చిట్కాను పంచుకున్నారు.

కళ్ళు మూసుకుని చేతులు, కాళ్లు చాచి జిమ్‌లో విశ్రాంతి తీసుకోవడాన్ని ఈ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

"లేదు! నేను నిద్రపోలేదు. నా వెల్ నెస్ నిపుణుడు సూచించిన విధంగా, యోగ నిద్ర సెషన్లో ఉన్నాను. నేను వ్యాయామం చేసిన తరువాత ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటాను. ఒక మహమ్మారి ఆందోళన మిమ్మల్ని నిద్రలేకుండా, ఒత్తిడికి గురిచేస్తుంటే లేదా మీరు కూడా కోవిడ్ బారిన పడి కోలుకుంటే, యోగ నిద్ర మీకు బాగా ఉపకరిస్తుంది అని రాసుకొచ్చింది.

ఇక రకుల్ నటించిన తాజా చిత్రం ఓటీటీలో విడుదలైంది. అర్జున్ కపూర్, నీనా గుప్తా కలిసి నటించిన డిజిటల్ చిత్రం "సర్దార్ కా గ్రాండ్సన్". కాశ్వీ నాయర్ దర్శకత్వంలో కుముద్ మిశ్రా, సోని రజ్దాన్ కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story