సినిమా

Rakul Preet Singh: రకుల్‌కు ఏమైంది.. ఇలా ఉందేంటి?

Rakul Preet Singh: హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా.. మరింత అందంగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు.

Rakul Preet Singh: రకుల్‌కు ఏమైంది.. ఇలా ఉందేంటి?
X

Rakul Preet Singh: హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా.. మరింత అందంగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలావరకు హీరోయిన్లను కమర్షియల్ ఎలిమెంట్‌‌గా భావించే సినీ పరిశ్రమలో అందంగా ఉంటేనే ఆఫర్లు లభిస్తాయన్న మూఢనమ్మకం ఉంది. అందుకే వారు ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ, డైట్‌లు మెయింటేయిన్ చేస్తూ ఉంటారు.అప్పటికీ వారి అందంపై వారికి కాన్ఫిడెన్స్ రాకపోతే సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనకాడరు. కానీ ఆ సర్జరీలు అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ప్రస్తుతం పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh)ను చూస్తుంటే అదే అనిపిస్తుంది.

ఒకప్పుడు బొద్దుగా, అందంగా ఉండే రకుల్.. ఫిట్‌నెస్ పేరు చెప్పి మరింత సన్నగా తయారయ్యింది. దాని వల్ల అప్పటినుండే తనకు ట్రోల్స్ ఎక్కువయ్యాయి, ఆఫర్లు తక్కువయ్యాయి. అంతే కాకుండా ముక్కుకు సర్జరీ కూడా చేయించుకున్న రకుల్ మొహంలో కళ ఇప్పుడు పూర్తిగా పోయింది.

ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఒకప్పటి రకుల్‌కు, ఇప్పటి రకుల్‌కు అస్సలు పోలికలు లేవంటూ తన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. నేచురల్‌గా అందంగా ఉండే రకుల్.. అనవసరంగా ఫిట్‌నేస్ అంటూ, సర్జరీ అంటూ తన అందాన్ని పాడుచేసుకుంటుంది అని సినీ లవర్స్ విమర్శిస్తున్నారు. అంతే కాక తాను ఇటీవల ఇంకేదైనా సర్జరీ చేయించుకుందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES