సినిమా

ఒక హిట్ మూవీ. ఒక ఫ్లాప్ మూవీలో నటించే అవకాశం మిస్సయ్యా.. : రకుల్

ఆ సినిమా నుంచి కూడా నన్ను తప్పించారు. అలా రెండో సారి షాక్ తగిలింది.

ఒక హిట్ మూవీ. ఒక ఫ్లాప్ మూవీలో నటించే అవకాశం మిస్సయ్యా.. : రకుల్
X

అదృష్టం వరించిందనుకుంటే అంతలోనే చేజారిపోతుంటుంది ఒక్కోసారి.. ఇది నటీ నటుల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. కాల్షీట్లు లేవనో, పాత్ర పరిణతిని అంచనా వేయలేకో దగ్గరకు వచ్చిన పాత్రను కాదనుకుంటారు. మరోసారి వాళ్లని అనుకొని కూడా మరొకరిని తీసుకుంటారు.. ఇలాంటివి తన సినీ ప్రయాణంలో కూడా జరిగాయని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.

ప్రభాస్ హీరోగా 2011లో వచ్చిన మిస్టర్ ఫరెఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఈ సినిమాలోని ప్రియ పాత్ర కోసం ముందు రకుల్‌ని అనుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆమెతో షూటింగ్ కూడా చేశారు. కానీ అంతలోనే చిత్ర టీమ్ మనసు మార్చుకుని, రకుల్‌ని తప్పించి కాజల్‌ని తీసుకుంది. కారణమేంటని రకుల్‌ని విచారిస్తే.. అప్పుడు నేను డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను.. అది పెద్ద సినిమా అని తెలియదు.. పాకెట్ మనీ కోసమే నటిస్తున్నాను.

వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని సెట్‌లో ఖాళీ సమయం దొరికితే చదువుకుంటూ ఉండేదాన్ని.. కొత్త అమ్మాయితో చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి ఉంటారు. అందుకే అప్పటికే హిట్ అయిన డార్లింగ్ సినిమాని దృష్టిలో పెట్టుకుని ఆ పెయిర్‌నే రిపీట్ చేసి ఉంటారు. అందుకే నన్ను వద్దనుకుని ఉండవచ్చు. కానీ నన్ను ఆ సినిమాలో నుంచి తీసేసరికి షాకయ్యా.. కెరీర్ మొదట్లోనే ఇలా అయిందేమిటని కొంచెం బాధపడ్డాను. అయితే సవాళ్లు ఎదురుకాకపోతే జీవితంలో పైకి రాలేము.

ఆ తర్వాత మరో చిత్రం ఆటో నగర్ సూర్యలో కూడా ఆఫర్ వచ్చినట్లే వచ్చి పోయింది. ముందుగా అనుకున్న హీరోయిన్ సమంత.. ఆమెకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో నన్ను తీసుకున్నారు. కొద్ది రోజులకే ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కావడంతో ఆ సినిమా నుంచి కూడా నన్ను తప్పించారు. అలా రెండో సారి షాక్ తగిలింది. ఆ తరువాత చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టాను.. డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా మిస్ ఇండియా పోటీలకు వెళ్లా.. సినిమాలు ఎంచుకునే విధానం తెలిసింది.. ఆ రెండు సినిమాల్లో నన్ను తీసి ఉండకపోతే సినిమా విలువ తెలిసేది కాదు అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్.

Next Story

RELATED STORIES