సినిమా

నాన్నకు ప్రేమతో.. 43 ఏళ్ల తండ్రి ప్రస్థానం: చరణ్

ఇప్పుడంటే సినిమాలు ఎంటర్టైన్మెంట్ లవర్స్‌కు ఒక వ్యసనంగా మారిపోయాయి. కానీ ఒకప్పుడు వాటిని పట్టించుకున్న వారు చాలా తక్కువ.

నాన్నకు ప్రేమతో.. 43 ఏళ్ల తండ్రి ప్రస్థానం: చరణ్
X

ఇప్పుడంటే సినిమాలు ఎంటర్టైన్మెంట్ లవర్స్‌కు ఒక వ్యసనంగా మారిపోయాయి. కానీ ఒకప్పుడు వాటిని పట్టించుకున్న వారు చాలా తక్కువ. అంతే కాకుండా సినిమాలలో పనిచేస్తున్న వారికి కూడా పెద్దగా గుర్తింపు లభించేది కాదు. అలాంటి సమయంలోనే టాలీవుడ్ స్థాయిని పెంచిన హీరోలు కొందరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవి.

ప్రాణం ఖరీదు అనే చిత్రంతో హీరోగా పరిచయమయిన చిరు ఇప్పటికీ సినిమాలతో అందరినీ అలరిస్తూ మెగాస్టార్‌గా వెలిగిపోతున్నాడు. తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలయ్యి సరిగ్గా 43 సంవత్సరాలు అయ్యింది. ఆ సందర్భంగా తన తండ్రి సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్ తన ట్విటర్‌లో తండ్రి గురించి పోస్ట్ చేసాడు.

ప్రాణం ఖరీదు చిత్రంలోని ఒక స్టిల్‌ను, చిరు అప్‌కమింగ్ చిత్రం అయిన ఆచార్యలోని ఒక స్టిల్‌ను పక్కపక్కన పెట్టి 'మై అప్ప స్టిల్ కంటున్యూ' అని క్యాప్షన్‌ను జోడించాడు . ఒకప్పటి లాగానే ఇప్పటికీ కూడా చిరంజీవికి ఉన్న అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చిరు అంటే చాలామందికి ఇష్టం. 60 ఏళ్ల వయసు దాటినా కూడా ప్రేక్షకులను అలరించడానికి మెగాస్టార్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

మధ్యలో రాజకీయాల వల్ల సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్న చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న ఆచార్య షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. దాని తర్వాత మెహర్ రమేశ్‌తో భోళా శంకర్, బాబితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు చిరు. ఈ 43 ఏళ్ల లాగానే ఇక ముందు కూడా మెగాస్టార్ కెరీర్ వెలిగిపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story

RELATED STORIES